Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బాయ్‌ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లతో.. ఇల్లు కొనేసింది!

Women-I-Phonesచైనాకు చెందిన ఓ అమ్మాయి తాజాగా ఇల్లు కొనుగోలు చేసింది. అందుకోసం వాడిన డబ్బులు ఆమెవి కావు.. కష్టపడి సంపాదించినవి అంతకన్నా కాదు.. కానీ ఆ అమ్మాయి ఇల్లు కొన్న విధానం గురించి తెలిస్తే ముక్కన వేలేసుకోవాల్సిందే…. చైనాలోని షెంజెన్‌కు చెందిన జియోలి (అసలు పేరు కాదు) అనే అమ్మాయి చాలా తెలివిగా ఓ ఇంటిదైంది. ఆ ఆమ్మాయికి ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్స్. ఆ 20మంది ఆమెకు తాజాగా విడుదలైన ఐఫోన్ 7 బహుమతిగా ఇచ్చారు. అయితే జియోలి ఆ 20 ఐఫోన్లను మొబైల్ రిసైక్లింగ్ వెబ్‌సైట్ ‘హుయ్ షౌ బౌ’లో 12 మిలియన్ చైనీస్ (దాదాపు రూ.12లక్షలు)యోన్‌లకు విక్రయించింది. ఆ డబ్బును చైనాలోని ఓ ప్రాంతంలో డిపాజిట్‌గా కట్టి ఓ ఇంటికి ఓనర్ అయింది.
ఈ విషయం తెలుసుకున్న జియోలి కొలిగ్స్ ఆశ్చర్యానికి గురైయ్యారు. జియోలిని ‘ప్రౌడ్ క్యోబా’ అని పిలుచుకుంటున్నారు. ఆమె కార్యాలయంలో ఒకరు మాట్లాడుతూ.. జియోలిది పేద కుటుంబం.. కుటుంబంలో ఆమె పెద్ద కూతురు.. తల్లిదండ్రులు వృద్దులు. ఆమెకు ఎప్పటినుంచో ఇల్లు కొనాలనే కోరిక ఉండేది.. కానీ ఆమె ఈ పద్దతి ఎంచుకుంటుదని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Comments

comments