Home అంతర్జాతీయ వార్తలు చైనా అధ్యక్షుడి కాలపరిమితి రద్దు

చైనా అధ్యక్షుడి కాలపరిమితి రద్దు

GIN-PING

బీజింగ్ : చైనా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి కాలపరిమితిని రద్దు చేస్తూ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఓ చట్టాన్ని ఆమోదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న షీ జిన్‌పింగ్ జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాన్ని ఈ చట్టం ఆమోదిస్తోంది. ఎవరైనా చైనా అధ్యక్షుడిగా రెండుసార్లు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనలు ఇప్పటివరకు ఉన్నాయి. ఈ నిబంధనలను ఇప్పుడు తొలగించారు. గతంలో దీనిపై చైనా పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. దీంతో ఆదివారం జరిగిన ఓటింగ్ నామమాత్రంగానే మారింది. మొత్తం 2,964 ఓట్లు ఉండగా ముగ్గురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. రెండు వ్యతిరేక ఓట్లు వచ్చాయి. మిగిలిన ఓట్లన్నీ జిన్‌పింగ్‌కు అనుకూలంగానే పడ్డాయి.

Chinese President Termination Cancellation