Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిన టియాంగ్‌గాంగ్

Sky-Lab

బీజింగ్ :  చైనా స్పేస్‌లాబ్ టియాంగ్‌గాంగ్  సోమవారం ఉదయం దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిపోయిందని చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. దక్షిణ పసిపిక్ మహాసముద్రంలో కూలిపోయిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ధ్రువీకరించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత ఈ అంతరిక్ష ప్రయోగనౌక గంటకు 26 వేల కిలోమీటర్ల వేగాన్ని సంతరించుకుందని పేర్కొంది.  ఇది సముద్రంలో కూలిపోవడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చైనా అంతరిక్ష సంస్థతో పాటు యూరోపియన్ స్పేస్ ఎజెన్సీలు ఎప్పటికప్పుడు దీని కదలికలను గమనించాయి.

చైనా తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రంగా టియాంగ్‌గాంగ్‌ను 2౦11లో కక్ష్యలోకి పంపించారు. అంతరిక్ష ప్రయోగాలలో పూర్తి స్థాయి విజయం దిశలో స్పేస్ లాబ్ సంస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రాథమికంగా ఈ స్పేస్‌లాబ్‌ను పంపించారు. అయితే ఐదేళ్లు బాగానే పనిచేసిన తరువాత 2౦16లో ఈ ల్యాబ్ నౌక భూ కేంద్రం నుంచి అదుపు తప్పింది. అప్పటి నుంచి అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు భూమిని తాకే దశకు చేరింది. ఆదివారానికి ఈ స్పేస్‌లాబ్ భూ వాతావరణానికి 179 కిలోమీటర్ల దూరంలో ఉందని చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించినట్టు హాంగ్‌కాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.

అదుపు తప్పి భూమి వైపు వస్తున్న ఈ ఎనిమిది టన్నుల స్పేస్‌లాబ్ ఏ సమయంలో, ఎక్కడ పడుతుందనేది కొన్ని పరిశోధన కేంద్రాలు ఆందోళన చెందాయి.  అయితే సోమవారం ఉదయం ఏడున్నర ప్రాంతంలోనే టియాంగ్‌గాంగ్ భూమిని తాకే వీలుందని యూరోపియన్ స్పేస్ ఎజెన్సీ తెలిపింది. ఇప్పటి అంచనాల మేరకు ఈ  చైనా స్పేస్‌లాబ్ పడే వీలున్న ప్రాంతాలు ఇవే అని ఈ ఎజెన్సీ వెల్లడించింది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ ఎక్కడైనా స్పేస్‌లాబ్ పడవచ్చని, మిచిగాన్ దిగువ దక్షణ ప్రాంతం , ఉత్తర కాలిఫోర్నియా, పెన్‌సిల్వివెనియా ప్రాంతాలలో పడే అవకాశం ఉందన్నారు.

దీనితో ఈ చైనా స్పేస్‌లాబ్ భయాలు ఎక్కువగా అమెరికాకే పట్టుకున్నాయి. అయితే తమ ప్రాంతంలో ఇది పడే అవకాశం లేదని అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం అధికారులు తెలిపిన కూడా నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఆందోళన చెందినట్టు సమాచారం. అయితే ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే పడేవి కేవలం చిన్న చిన్న శకలాలే అని, దీని వల్ల పెద్దగా ముప్పు లేదని చైనా అధికార వర్గాలు తెలిపాయి. దీని పతనంతో భూమిపై నివాసాలకు ప్రజలకు నష్టం ఏమీ ఉండదని, అదే విధంగా ఇది మండిపోవడం వల్ల విషరసాయనిక పదార్థాలు వాతావరణంలో ప్రవేశించే వీలేమీ లేదని చైనా సైనిక వర్గాలు తెలిపాయి.

Comments

comments