Search
Wednesday 21 November 2018
  • :
  • :

23న ‘చినబాబు’ ఆడియో

Chinna Babu Audio on June 23 and Release on July 13

కార్తీ నటించిన ‘చినబాబు’ సినిమా ఆడియోను ఈనెల 23న విడుదల చేయబోతున్నారు. సయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 13న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో  రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇక ‘చినబాబు’ ఆడియో విడుదల కార్యక్రమంలో కోలీవుడ్ స్టార్ సూర్య పాల్గొనబోతున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో శత్రు విలన్‌గా నటించాడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను హీరో సూర్యతో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రియా భవాని శంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్‌ః వేల్ రాజ్, ఎడిటింగ్‌ః రుబన్.

Comments

comments