Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

నువ్వు రైతువైతే కాలరేగురేసుకుని తిరుగంతే…(టీజర్)

Chinna Babu Official Telugu Teaser Released

హైదరాబాద్: ప్రముఖ తమిళ దర్శకుడు  పాండిరాజ్‌, హీరో కార్తీ కాంబోలో వస్తున్న చిత్రం ‘చినబాబు’. రైతు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ లో కార్తీ పలికిన ‘పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే’, ‘నువ్వు రైతువైతే కాలరేగురేసుకుని తిరుగంతే…’ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తీకి జోడిగా ‘అఖిల్’ ఫేం సాయేషా సైగల్‌ నటిస్తోంది. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై కార్తీ అన్నయ్య, హీరో సూర్య చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతేడాది ఖాకీ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తీ త్వరలోనే ‘చినబాబు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక టాలీవుడ్ లోనూ సూర్య, కార్తీ సోదరులకు మంచి ఫ్యాన్ ఫాలోవింగ్ ఉన్న విషయం తెలిసిందే.

Comments

comments