Home గాసిప్స్ చిరు, కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్..?

చిరు, కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్..?

Chiranjeevi and Koratala Shive movie Title Fixed?

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా‘ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తనయుడు రాంచరణ్ కొణిదేల బ్యానర్ పై భారీ వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత చిరు టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటికే శివ తలమునకలై ఉన్నారు. ఇక కమర్షియల్ హంగులతో స్ట్రాంగ్ మెసెజ్ ఒరింయంటెడ్ మూవీస్ తీసే కొరటాల… చిరంజీవితో ఎలాంటి సబెక్టుతో రాబోతున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విషయమై ఇప్పటికే రకరకాల గాసిప్స్ పుట్టుకువస్తున్నాయి. తాజాగా ఓ పుకారు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో చిరు రైతు బాంధవుడిగా కనిపిస్తారట. రైతుల తరఫున వాళ్ల సమస్యలపై పోరాడే వ్యక్తిగా ఈ చిత్రంలో మెగాస్టార్ కనిపించనున్నారని తెలుస్తోంది. అందుకే ఈ మూవీకి ‘రైతు’ అనే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం అభిప్రాయం. దీంతో ఈ టైటిల్ నే ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు సమాచారం.