Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్‌కు పెద్ద అభిమానిని

Kashmir-Paradeshi

నాగశౌర్య, కశ్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి తెరకెక్కించిన చిత్రం ‘నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందింది. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కశ్మీర పరదేశీలో ఇంటర్వూ విశేషాలు…

మోడలింగ్ చేసి సినిమాల్లోకి…
మా స్వస్థలం పూణే. ముంబయ్‌లోని నిఫ్ట్‌లో ఫ్యాషన్ కోర్స్ చేశాను. ఆతర్వాత మోడలింగ్ చేయడం జరిగింది. కొన్ని యాడ్స్‌లో కూడా నటించాను. ఈ క్రమంలో ‘నర్తనశాల’ ఆడియన్స్‌కు రావడం, దర్శకుడు శ్రీనివాస్ ఎంపికచేయడం జరిగింది.
టీచర్‌గా కనిపిస్తా…

ఈ సినిమాలో నేను సాధారణ అమ్మాయిగా నటించాను. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే హీరోయిన్ పాత్ర నాది. ఈ సినిమాలో టీచర్‌గా కనిపిస్తాను.

హ్యాపీగా అనిపించింది…

నాగశౌర్యతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అతను నాకు చాలా సహాయం చేశాడు. ఆయన మంచి హీరో. నాగశౌర్య తల్లి ఉషా కాస్టూమ్స్ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చారు.

తెలుగు సినిమాలంటే ఇష్టం…

‘నర్తనశాల’ నా తొలి చిత్రం. ఈ సినిమా చేస్తూ చాలా నేర్చుకున్నాను. ఇక తెలుగు సినిమాలు పూణే, ముంబయ్‌లో ప్రదర్శిస్తారు. నాకు తెలుగు రాకపోయినా అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూసేదాన్ని. తెలుగు సినిమాల్లో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. రొమాన్స్, లవ్, కామెడీ, ఫైట్స్ ఇలా అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. అలాగే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. తెలుగు సినిమాలంటే నాకెంతో ఇష్టం.

ఆ ముగ్గురు హీరోలు అంటే ఇష్టం….

తెలుగులో అందరి హీరోల సినిమాలు చూస్తాను. అయితే హీరోలు అల్లుఅర్జున్, మహేష్‌బాబు అంటే ఇష్టం. అలాగే మెగాస్టార్ చిరంజీవికి నేను పెద్ద అభిమానిని. ఈ ముగ్గురి సినిమాలను మాత్రం నేను అసలు మిస్ కాను. వీరి అన్ని సినిమాలు చూస్తాను.

అందుకే నటనపై ఆసక్తి…

నేను కథక్ డాన్సర్‌ని. డాన్స్ కారణంగానే నటనపై ఆసక్తి కలిగింది. చిన్నప్పటి నుంచి కథక్ డాన్స్ నేర్చుకున్నాను.

నెక్ట్స్ మూవీ…

సిద్ధార్థ్, జి.వి.ప్రకాష్ కాంబినేషన్‌లో వస్తున్న ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాకు శశి దర్శకుడు. ఇందులో కూడా నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నాను.

Comments

comments