Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బన్నీ డాన్స్‌ను ఎంజాయ్ చేసిన చిరు

bunny

అల్లుఅర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ నిర్మాతగా బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ సాంగ్ సెట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి సందడి చేశారు. బన్నీ డాన్స్ చేస్తున్నంతసేపు చిరు ఎంజాయ్ చేశారు. ఈ పాట తనకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్‌ను కలిసి సినిమా విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు. చిరంజీవితో పాటు గీతాఆర్ట్ అధినేత అల్లు అరవింద్ కూడా ఈ సెట్‌లోకి విచ్చేశారు. మరోవైపు బ్యూటిఫుల్ లవ్… అంటూ సాగే పాటను ఈమధ్యే నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష శ్రీధర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈనెల 22న సినిమా ఆడియోను రిలీజ్  చేస్తుండగా…. 29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్  ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. మే 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Comments

comments