Home తాజా వార్తలు జూలైలో సెట్స్‌పైకి

జూలైలో సెట్స్‌పైకి

ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ ఓకే అయింది. బౌండ్ స్క్రిప్ట్‌తో కొరటాల సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మీద స్పష్టత లేదు. ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలై వచ్చే నెలతో సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా కొత్త సినిమాను మొదలు పెట్టలేదు కొరటాల శివ.

తాజా సమాచారం ప్రకారం ‘సైరా’ షూటింగ్ జూన్ చివరి వరకు సాగుతుందట. కాబట్టి కొరటాల అప్పటిదాకా వేచి చూడాల్సి ఉంటుంది. అసలే మెగాస్టార్ సినిమా. ఇతర హీరోలతో కొరటాల ఎప్పుడైనా సినిమాలు చేసుకోవచ్చు. కానీ చిరంజీవి అలా కాదు. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తారు కాబట్టి మెగాస్టార్‌తో మూవీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. పైగా తమ కెరీర్‌లో ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్న దర్శకులు ఎందరో ఉన్నారు. ఇక చిరంజీవితో సినిమాను జూలైలో మొదలుపెట్టి డిసెంబర్‌లోపు పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నారట కొరటాల శివ. హీరోయిన్‌గా శృతిహాసన్ కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం కొరటాల శివ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నారు. వీలు కుదిరినప్పుడు చిరుతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi, Koratal Shiva movie start in July