Home గాసిప్స్ సంక్రాంతికి నెక్ట్స్ మూవీ విడుదలకు ప్లాన్

సంక్రాంతికి నెక్ట్స్ మూవీ విడుదలకు ప్లాన్

chiru

తన 151వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వలో చేసేందుకు సిద్ధమవుతున్నాడు చిరంజీవి. ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఇక ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలని అనుకుంటున్నాడు చిరంజీవి. మరో రెండేళ్లలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అప్పటికి రాజకీయంగా తన బేస్‌ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు చిరు. అలా అని మరోసారి సినిమాల్ని పక్కనపెట్టే పరిస్థితి లేదు. అందుకే ఇటు సినిమాలు, అటు పొలిటికల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయాలంటే ఏడాదికి ఒక సినిమా చేయడమే కరెక్ట్ అని చిరంజీవి భావిస్తున్నాడట.