Home గాసిప్స్ త్రివిక్రమ్ తో చిరంజీవి 152 వ చిత్రం…!!?

త్రివిక్రమ్ తో చిరంజీవి 152 వ చిత్రం…!!?

Megastar chiranjeevi next movie with trivikram srinivas

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 వ చిత్రం ఖైదీనంబర్150 రిలీజయిన రోజు నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీసు రికార్డులను ఓవైపు తిరగరాస్తుంటే… మరో వైపు చిరంజీవి 151, 152, 153 వ సినిమాలపై ఇండస్ట్రీలో పేద్ద చర్చే జరుగుతుంది.

చిరంజీవి తన 151 వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి లేదా బోయపాటి శీను దర్శకత్వంలో చేయనున్నాడని… ఆ మూవీని మళ్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేదంటే అల్లు అరవింద్ నిర్మించనున్నారని ఇండస్ట్రీ టాక్.

ఇక, చిరంజీవి… 152 సినిమాను మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడట. ఈ మూవీని అశ్వనీదత్ నిర్మిస్తాడట. ఇక, తన 151 వ సినిమా ఏమో గాని… త్రివిక్రమ్, చిరంజీవి కాంబోలో సినిమా వస్తే మాత్రం ఇక తెలుగు సినిమా రికార్డులు బద్దలు కావాల్సిందేనని మెగా అభిమానులు, సినీ ఇండస్ట్రీ కోడై కూస్తున్నదట.