Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మామ టైటిల్‌తో వస్తున్న అల్లుడు

kalyan

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘విజేత’ అనే టైటిల్ ఖరారు చేశారు. 1985లో చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్‌తో ఇండస్ట్రీకి వస్తున్నాడు. కథకు తగ్గట్టుగా ఈ చిత్రానికి ‘విజేత’ అనే టైటిల్ పెట్టారు. సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రం వస్తోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈమధ్యే డబ్బింగ్ కూడా మొదలుపెట్టాడు హీరో కళ్యాణ్ దేవ్. బాహుబలి ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది ఈ చిత్రం. నాజర్, తనికెళ్ల భరణి, మురళీశర్మ, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః హర్షవర్ధన్ రామేశ్వర్, ఎడిటింగ్‌ః కార్తీక శ్రీనివాస్, పాటలుః రెహమాన్, రామజోగయ్యశాస్త్రి, ఆర్ట్‌ః రామకృష్ణ.

Comments

comments