Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

చిరంజీవి, అల్లు అర్జున్‌ల మల్టీస్టారర్..?

mega-starకన్నడంలో స్టార్ హీరోలు అంబరీష్, పునీత్ రాజ్‌కుమార్‌లు కలిసి ఓ సినిమా చేశారు. ‘దొడ్డమానే హడ్గ’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. పునీత్ రాజ్‌కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట. ఇప్పటికే బన్నీ వద్దకు ఈ ఆఫర్ వెళ్లగా… ఇది అతని పరిశీలనలో ఉందట. ఇక కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట. ఇది సాధ్య మో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ… ఒకవేళ సాధ్యమైతే మాత్రం తెలుగు మల్టీస్టార ర్ చరిత్రలో ఓ కొత్త శకం ప్రారంభమైనట్లే. కాన్సెప్ట్, ప్రాజెక్ట్ బాగానే ఉన్నా… కన్నడంలో సిని మా రిజల్ట్ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్‌లో ఈ చిత్రం రీమేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Comments

comments