Home వార్తలు స్పెషల్ సాంగ్‌లో చిరు సందడి

స్పెషల్ సాంగ్‌లో చిరు సందడి

chiruమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో గత కొంత కాలంగా ఈ చిత్రం నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి పండుగా కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలోనూ చిరు మార్క్ డ్యాన్సులు ఉండబోతున్నాయి. కెరీర్ ప్రారంభం నుంచి తన హుషారైన డ్యాన్సులతో ప్రేక్షకులను మైమరపిస్తూ వస్తున్నాడు ఈ మెగాస్టార్. ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’లోని ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్‌లో చిరంజీవి తనదైన స్టైల్ డ్యాన్సులతో అదరగొడుతున్నాడు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో రాఘవ లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సాంగ్‌లో క్యాథరిన్ స్థానంలో వచ్చిన హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్… చిరంజీవి మాస్ స్టెప్పులకు అనుగుణంగా ఆడిపాడుతోంది. ఈ పాటకు దేవిశ్రీ లిరిక్ అందించడమే కాకుండా హుషారైన ట్యూన్ కట్టారు. మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొకటిగా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రణతో పాటు బ్యాలెన్స్ షూటింగ్‌ను పూర్తిచేస్తూ… నిర్మాణానంతర పనులు కూడా కొనసాగిస్తారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవికి జంటగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.