Home తాజా వార్తలు కలలను నిజం చేసుకోవడానికి పోరాడండి

కలలను నిజం చేసుకోవడానికి పోరాడండి

Chitralahari Teamసాయిధరమ్ తేజ్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం నిర్మించిన చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ “ఈ సినిమా సక్సెస్ అయి బాగా కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. అయితే నేను సినిమా ప్రజలకు బాగా రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు. మా టీమ్‌తో పాటు ఈ సినిమా చూసి ప్రేరణ పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. మీ కలలను నిజం చేసుకోవడానికి పోరాడండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా సక్సెస్ దక్కుతుంది. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు చక్కగా నటించారు.

దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “తేజుకు మంచి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. దర్శకుడు కిషోర్ తిరుమల సింపుల్ క్యారెక్టర్స్‌ను తీసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ నిర్మాతలు మామూలు అదృష్టవంతులు కారు. ఎందుకంటే ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్‌బస్టర్స్ సాధించారు. అది ఎవరికీ సాధ్యం కాదు”అని తెలిపారు. సునీల్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చి ఆదరించారు. సరైన సమయంలో మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు కిషోర్, నిర్మాతలకు థాంక్స్‌”అని తెలిపారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ “సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. నాలాంటి పాత్రలు మనకు జీవితంలో ఎక్కడైనా కనపడతాయి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిషోర్ తిరుమల, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Chitralahari Movie Success Meet at Hyderabad