Home తాజా వార్తలు ‘చిత్రలహరి’తో సాయికి హిట్ పడెటట్టే ఉంది…(టీజర్)

‘చిత్రలహరి’తో సాయికి హిట్ పడెటట్టే ఉంది…(టీజర్)

Chitralahariహైదరాబాద్: సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న తాజ చిత్రం ‘చిత్రలహరి’. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలోని పాత్రలోని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ టీజర్ ను వదిలారు. ఇక ఈ మూవీలో సాయికి జోడిగా కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ బాణీలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చుకున్న మెగా మేనల్లుడు ఈ సినిమాతో తిరిగి సక్సెస్‌ బాటపట్టాలని చూస్తున్నాడు. డైరెక్టర్ కిశోర్‌ తిరుమల చివరి చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆయన కూడా ‘చిత్రలహరి’పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇద్దరికీ ఈ సిన్మా విజయం ఎంతో ముఖ్యం. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Chitralahari Movie Teaser is Released