Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కొత్త రికార్డు

Chopra is the best actress in Bollywood and Hollywood

బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్‌ను పొందిన ఈ భామ ‘క్వాంటికో’ టివి సిరీస్ ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ‘బే వాచ్’ అనే సినిమాలో నటించిన ఆమె ఇప్పుడు న్యూయార్క్‌లోనే నివసిస్తోంది. అయితే తరచుగా వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక ఓ కొత్త రికార్డును సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉండడం విశేషం. దీంతో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీగా ఆమె రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రియాంక ‘25 మిలియన్ల ఫ్యాన్స్ ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక తర్వాత దీపికా పదుకునేకు 24.9 మిలియన్ల ఫాలోవర్స్, విరాట్ కోహ్లికి 22.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్‌లో తన ప్రతిభను చాటుకుంటున్న ప్రియాంక అమెరికా పాపులర్ సింగర్ నిక్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల అతనిని ఇండియాకు తీసుకొచ్చి, తన కుటుంబానికి పరిచయం చేసింది. ఆతర్వాత ప్రియాంక, నిక్, పరిణితి కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేశారు.

Comments

comments