Home తాజా వార్తలు గేల్ గుడ్‌బై !

గేల్ గుడ్‌బై !

Chris Gayleప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్ మెన్లలో ఒకడైన విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్‌గేల్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్‌తో వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. 1999లో వన్డే కెరీర్ ప్రారంభించిన గేల్ తన తొలి మ్యాచ్ ను టొరంటో వేదికగా భారత్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న గేల్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక విండీస్ క్రికెటర్‌గా, బ్రియాన్ లారా తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కూడా ఆయన రికార్డు సృష్టించాడు.

ఇక 20 ఏళ్ల కెరీర్‌లో 103 టెస్టులాడిన గేల్ 7,215 పరుగులు చేశాడు. అలాగే 284 వన్డేల్లో 9,727 పరుగులు, 56 టీ20లలో 1,607 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టులో ఆడటాన్ని తగ్గించేశాడు. కాగా, గతేడాది జూలైలో తిరిగి వన్డేల్లో ఆడుతున్నాడు. పొట్టి క్రికెట్‌లో విధ్వంసం సృష్టించే గేల్…
తుఫాన్ ఇన్నింగ్స్‌లతో టీ20 ఫార్మాట్ లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Chris Gayle to retire from ODIs after 2019 World Cup