Home తాజా వార్తలు ఘనంగా క్రిష్టియన్ రిఫార్మేషన్ డే

ఘనంగా క్రిష్టియన్ రిఫార్మేషన్ డే

1

హైదరాబాద్ : ప్రపంచ సంఘ సంస్కర్త, క్రైస్తవ సువార్త విప్లవ కారకుడు మార్టిన్ లూథర్ 1517లో అప్పటి మతపాలకుల నుండి బైబిల్ గ్రంథాన్ని, క్రీస్తు రక్షణ సువార్తను ప్రపంచానికి అందించి 2017 అక్టోబర్ కు 500 ఏళ్లు పూర్తైన సందర్భంగా క్రిస్టియన్ రిఫార్మేషన్ డే సెలబ్రేషన్ కమిటీ, అన్వేషి టివి సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని హరిహరా కళాభవన్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాస్టర్ ప్రకాష్ అధ్యక్షత వహించగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సాహితీ కళావేత్త ఎస్ వి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ కొలకలూరి ఇనాక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి సమాజంలో కూడా 1517కి ముందు ఉన్నట్లుగానే ఇంకా ఆధిపత్య పోకడలు అన్ని మతాలలో కొనసాగుతున్నాయి. భక్తులను మత విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛ లభించటంలేదు. అప్పటి పోప్ లాగా నేటి పాస్టర్ల అజమాయిసీ సమాజానికి నష్టం కలిగిస్తుందని, మార్టిన్ లూథర్ కింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కొలకలూరి ఇనాక్ ప్రభోదించారు.

అనంతరం విజనరీ బిషప్ ధనరాజ్ కోట వాక్య ప్రసంగము చేయగా వరల్డ్ హిస్టరీ, బైబిల్ థియోలజీ ప్రొఫెసర్ గిల్ బర్ట్ డాసన్ రిఫార్మేషన్ డే ప్రాముఖ్యతను వివరించగా, టిడిపి గ్రేటర్ అధ్యక్షులు ఎంఎన్ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముఠా గోపాల్, జెరుషలేము మత్తయ్య, పలువురు బిషప్ లు, పాస్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వేషి టివి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రముఖులు రెవరండ్ డాక్టర్ పమ్మీ డానియేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోసెఫ్, క్రైస్తవ ప్రజాగాయకుడు సునీల్, అడ్వకెట్ గ్లోరీఆనందలతోపాటు పలువురు సామాజిక సేవకులు, సువార్తికులకు, రిఫార్మేషన్ కమిటీ తరఫున వారికి అవార్డులు అందజేసిందని నిర్వాహకులు యేసుదాస్ గారు, షేర్ల అనిల్ తెలిపారు.

Christian Reformation Day Celebrations under the guidance of Anweshi TV