Home దునియా ఎల్లలెరుగని పండుగ… మెర్రీ క్రిస్మస్

ఎల్లలెరుగని పండుగ… మెర్రీ క్రిస్మస్

Christmas-is-Birth-of-Jesus

ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ పండుగను డిసంబర్ 25వ తారీఖున జరుపుకుంటారని మనకు తెలిసిందే, కాని కొన్ని దేశాల్లోని చర్చిలు వారి మతపరమైన క్యాలెండర్లకనుగుణంగా వేరే తారీఖుల్లో ఈ పండుగను జరుపుకునే పద్ధతి ఉంది. రష్యా,సెర్బియా,జెరూసలెం,ఉక్రెయిన్,ఇథియోపియా వంటి సనాతన చర్చి సంప్రదాయాలు పాటించే దేశాల్లో జూలియన్ క్యాలెండర్ ప్రకారం అక్కడి ప్రజలు క్రిస్టమస్‌ను జనవరి ఏడున జరుపుకుంటారు.గ్రీక్ క్యాథలిక్స్ కొంతమంది కూడా జనవరి ఏడునే జరుపుకునే ఆచారాన్ని పాటిస్తున్నారు.అమెరికాలోని ఎపస్టాలిక్ చర్చి జనవరి ఆరున జరుపుతుంది,ఇదే రోజున పన్నెండు రోజుల్లో చివరిరోజైన పండుగను కూడా జరుపుకుంటారు.

క్రిస్మస్ వేడుకలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి?
కిస్టియానిటీ కొత్తలో ఈస్టర్ ముఖ్య పండగగా ఉండేది. నాలుగవ శతాబ్దంలో చర్చి అధికారులు జీసస్ పుట్టినరోజును సెలవురోజుగా ప్రకటించాలని నిర్ణయించాయి. బైబిల్ లో జీసస్ పుట్టిన తేదీ ఎక్కడా చెప్పలేదు. కాని కొన్ని ఆధారాల ప్రకారం స్ప్రింగ్ సీజన్‌లో జీసస్ పుట్టుక జరిగింది. మొదటి పోప్ జూలియస్ డిసెంబర్ 25 ను జీసస్ పుట్టినరోజుగా ఎంచుకుని పాగాన్ శాటర్నేలియా ఫెస్టివల్‌గా పండగ చేయడం ఆరంభించారు. మొదట్లో ఈ పండగను ఆ ప్రాంతంలోనే జరుపుకునేవారు. తర్వాత ఈ ఆచారం 432 కల్లా ఈజిప్టుకి, తర్వాత ఆరవ శతాబ్దంలో ఇంగ్లాండుకి విస్తరించింది. ఎనిమిదవ శతాబ్దం చివరికల్లా క్రిస్మస్ వేడుకలు స్కాండినేవియా మొత్తానికి పాకాయి. ఇప్పటికి గ్రీక్, రష్యన్ సంప్రదాయ చర్చిల్లో, డిసెంబర్ 25 తర్వాత 13 రోజులకు జరుపుకుంటారు. దాన్ని ముగ్గురు రాజుల పండగగా జరుపుతారు. ఎందుకంటే ముగ్గురు తెలివైన రాజులు జీసస్‌ను కనుకున్నారు కాబట్టి వారి పేరు మీద పండగ చేస్తారు. 19 వ శతాబ్దంలో అమెరికన్లు కుటుంబానికి సంబంధించిన పండగగా జరుపుకోవడం ప్రారంభించారు. 1870 నుంచి అమెరికాలో క్రిస్మస్‌ను సెలవుగా ప్రకటిస్తున్నారు.

వివిధ కారణాలతో.. క్రిస్మస్ మాత్రమే కాక డిసెంబర్ చాలా దేశాలకు పండగ మాసం. వివిధ కారణాలతో పండగ జరుపుకుంటారు. నార్వేకి చెందిన సంస్కృతిని నోర్స్ అంటారు. యూరోప్ ప్రాంతంలో జరిపే క్రిస్మస్ వేడుకలను యూలే అంటారు. యూలే డిసెంబర్ 21 నుంచి జనవరి వరకు జరుగుతుంది. దానికి ఒక కథ ఉంది. సూర్యుడు దిగివచ్చినదానికి గుర్తుగా ఒక తండ్రీకొడుకులు పెద్ద దుంగను తెచ్చి మంట పెడతారు. ఆ దుంగ మండటానికి 12 రోజులు పట్టింది. ఆ పన్నెండు రోజులూ ప్రజలు పండగ చేసుకున్నారు. నార్వే సంప్రదాయక నమ్మకం ప్రకారం మంట నుంచి వచ్చే ప్రతి వెలుగు రవ్వ నుంచి రాబోయే యేడాదికోసం ఒక కొత్త పంది, ఒక దూడ పుడతాయని నమ్మకం.

యూరోప్‌లో ఇలా
యూరోప్ ప్రజలకు డిసెంబర్ నెల చివర భాగం వేడుకలు జరుపుకోడానికి అత్యంత అనువైన మాసం. ఆ సమయంలో ఎక్కువగా జంతువులను మాంసం కోసం చంపుతారు. అందుకే చలికాలం వాటిని మేపాల్సిన అవసరం ఉండదు. తాజా మాంసం సరఫరా చేయడానికి ఏడాది మొత్తంలో ఇదే అనువైన సమయం వారికి.
ఇళ్లనుంచి బయటకు రారు.
ఇళ్ల నుంచి బయటకు రారు
జర్మనీలో ప్రజలు, పగాన్ దేవుడు ఓడోన్‌ను పూజిస్తారు. అందుకే చలికాలం మధ్య నుంచి వాళ్లు సెలవులు జరుపుకుంటారు. ఓడెన్ అంటే జర్మన్లకు భయం. రాత్రి పూట ఆకాశంలో సంచరిస్తాడని, తన ప్రజలను గమనించడానికి, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు చూడటానికి వస్తాడని నమ్ముతారు. అందుకే చలికాలంలో బయట తిరగడం కంటే ఇళ్లలో ఉండటానికి ఇష్టపడతారు.
వారికి భయంకరమైన రోజు.
పిల్లల పండగ చేస్తారు
రోమ్‌లో చలికాలం అంత త్రీవ్రంగా ఉండదు. వ్యవసాయపు దేవుడు శాటర్న్ మీద గౌరవంగా పండగ జరుపుకుంటారు. ఆ సమయంలో ఆహారం పుష్కలంగా ఉంటుంది. వ్యాపార సంస్థలు, స్కూళ్లు అన్నీ వేడుకలు జరుపుకోవడం కోసం సెలవు ప్రకటిస్తారు. చలికాలంలోనే రోమన్లు జువెనేలియా అనే పిల్లల పండగను జరుపుకుంటారు. డిసెంబర్ 25న ఉన్నత వర్గాలవారు సూర్యదేవుడైన మిత్ర పుట్టినరోజును జరుపుకుంటారు. మిత్ర దేవుడు పసిపిల్లవాడు. అతను రాయి నుంచి పుట్టాడని నమ్ముతారు. రోమన్లకు మిత్ర దేవుడి పుట్టినరోజు ఏడాది మొత్తంలోకి భయంకరమైన రోజుగా అనుకుంటారు.