Home అంతర్జాతీయ వార్తలు తరిమేసిన జనాలను గుర్తుంచుకోండి

తరిమేసిన జనాలను గుర్తుంచుకోండి

int

గమ్యం, భద్రత లేని బలవంతపు వలస బాధితులను పట్టించుకోండి 

క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గల క్రైస్తవులకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపు
బెత్లహాంలో ఉత్సాహం నశించిన వేడుకలు

వాటికన్ సిటి: అమాయకుల రక్తాన్ని చిందించడానికి వెనుకాడని నాయకులవల్ల తమ సొంత భూభాగాల నుండి తరిమివేయబడ్డ వలస జనుల అగచాట్లను విస్మరించవద్దని ప్రపంచ వ్యాప్తంగాగల 1.3 బిలియన్ క్యాథలిక్‌లకు పోప్ ఫ్రాన్సిన్ ఆదివారం నాడు క్రిస్మస్ ప్రార్థనల్లో పిలుపునిచ్చారు. తమ గడ్డపై నుంచి నాయకులు తరిమేస్తే వేరే దారిలేక పారిపోయి వలస కట్టిన మిలియన్ల మంది అభాగ్యులను మరువవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.సెయింట్ పీట ర్స్ బాలిసికాలో ప్రార్థనలకు హాజరయిన భక్తులను ఉద్దేశించి ఆయన ఈ పిలుపు నిచ్చారు. జోసెఫ్ , మేరీ అడుగుజాడల్లో మరెన్నో వేరే అడుగుజాడలుదాగి ఉన్నాయని ఆయన చెప్పారు. నాయకులు తమ అధికారాన్ని, సంపద ను పెంచుకోడానికి ప్రయత్నిస్తూ లక్షలాది మందిని బలవంతంగా వలసబాట పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వయంగా ఆయన ఇటాలియన్ వలసదార్ల మనుమడు. 81 ఏళ్ల ఆయన అర్జెంటీనాకు చెందిన క్రైస్తవ పూజారి. జె రూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా కొత్తగా గు ర్తించడంవల్ల ఉద్రిక్తతలు వెస్ట్ బ్యాంక్ వెంబడి పెరిగిన నే పథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.జెరూసలేం లాటిన్ పె ద్దాయన అర్చిబిషఫ్ పియర్ బట్టిస్టా పిజ్జాభల్లా ఆపురాతన పట్టణంలో సామూహిక ప్రార్థనలకునేతృత్వంవహించారు.
బెత్లేహామ్‌లో నిరాసక్తంగా క్రిస్మస్ : ఈ పవిత్ర నగరంలో ప్రజలు మంద్రస్థాయిలో ఈసారి క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. జెరూసలేం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధాని గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తించిన పర్యవసానమిది. వేలాది మంది టూరిస్టులు సోమవారం నాడు క్రిస్మ స్ ఉత్సవాలకు దూరంగా ఉండిపోయారు.అర్ధరాత్రి సామూహిక ప్రార్థనలకు ముందు సాధారణంగా పోటీపడే మేంజర్ స్కేర్ వద్ద టూరిస్టులు, స్థానికులు నిరాసక్తంగా గడిపారు. ఈ విషాద చీకట్లకు ట్రంప్ కారణమని అక్కడి దుకాణాదారు ఒకరు వ్యాఖ్యానించారు. ట్రంప్ ఏదీ పరిష్కరించరని, సమస్యలు సృష్టించడమే ఆయనకు తెలిసిన విద్య అని మైఖేల్ కుంబ్సీ అనే ఆ దుకాణాదారు వ్యాఖ్యానించారు.పండుగ వాతావరణం,టూరిస్టుల సందడి లేకుం డా క్రిస్మస్ నిరాశతో గడుపుతున్నామని కాఫీ వ్యాపారి కాదెర్ అన్నారు.