Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సిఐ వేధింపులు : ఏఎస్‌ఐకి గుండెపోటు

ASI

హైదరాబాద్ : నగర పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న సుందర్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్న నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. సుందర్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిఐ వేధింపుల కారణంగానే తాను అనారోగ్యానికి గురయ్యానని సుందర్ చెబుతున్నారు. తన భార్య అనారోగ్యం సమస్యల కారణంగా కొంతకాలంగా తను విధులకు ఆలస్యంగా వెళుతున్నానని, దీన్ని అలుసుగా తీనుకున్న సిఐ తనపై పని ఒత్తిడి పెంచడమే కాక వేధింపులకు పాల్పడుతున్నాడని సుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపుల వల్లనే తనకు గుండెపోటు వచ్చిందని చెప్పారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న సిఐపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సుందర్ ప్రభుత్వాన్ని కోరారు.

 CI Harassment: Heart attack to ASI

Comments

comments