Home తాజా వార్తలు వ్యర్ధాల నిర్వహణపై సిఐఐ సదస్సు

వ్యర్ధాల నిర్వహణపై సిఐఐ సదస్సు

VENKAIAHహైదరాబాద్ : వ్యర్థాల నిర్వహణపై శుక్రవారం తాజ్‌కృష్ణాలో సిఐఐ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. వ్యర్ధాల నుంచి శక్తి ఉత్పత్తికి మరింత సాంకేతికత అవసరమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలు స్వచ్ఛ భారత్‌ను మెరుగ్గా నిర్వహిస్తున్నాయని కొనియాడారు. చెత్త నుంచి విద్యుదుత్పత్తికి విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా 16 విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈక్రమంలో నల్గొండ, హైదరాబాద్‌లలో విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాతో ఎపికి మంచి జరుగుతుందని, అందులో సందేహం లేదన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారం కావని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై అధ్యయనానికి ప్రధాని నీతి ఆయోగ్‌ను ఆదేశించారని తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహేతుకం కాదని ఆయన అన్నారు.