Home తాజా వార్తలు సినీ టెక్నీషియన్ ఏక్ నాథ్ కన్నుమూత

సినీ టెక్నీషియన్ ఏక్ నాథ్ కన్నుమూత

Cine Technician Eknathహైదరాబాద్ : ప్రముఖ సినీ టెక్నీషియన్ ఏక్ నాథ్ (70) బుధవారం ఉదయం కన్నుమూశారు. స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ గా ఆయన సినిమా పరిశ్రమంలో పేరుగాంచారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన స్పెషల్ ఎఫెక్ట్ ల సృష్టికర్తగా పేరుగాంచారు. ఎపిలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్ నాథ్ ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకు సోదరుడు. 55 ఏళ్ల క్రితమే ఆయన సినిమాల కోసం మద్రాసు వెళ్లారు. అమితాబ్, ఎన్ టిఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు పలువురు అగ్ర హీరోల సినిమాలకు ఆయన పని చేశారు. జానపద సినిమాల రూపకర్త విఠలాచార్య సినిమాలకు అప్పట్లోనే ఏక్ నాథ్ అద్భుత టెక్నాలజీని వాడారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో జానపద, చారిత్రక సిమాల్లో తన స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఏక్ నాథ్ రక్తి కట్టించారు. అంతేకాదు ఆయన పలు త్రీడి సినిమాలకు ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. తన కెరీర్ లో ఆయన సుమారు 700 సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. ఆయన మృతిపై టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Cine Technician Eknath Passed Away