Home తాజా వార్తలు మార్చి 2 నుంచి సినిమా హాళ్లు బంద్!

మార్చి 2 నుంచి సినిమా హాళ్లు బంద్!

Movie-Theaters-Bandh

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో యుఎఫ్‌ఒ, క్యూబ్ యజమానులతో జరిగిన థియేటర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు విఫలమవడంతో మార్చి 2 నుంచి దక్షిణాదిలోని సినిమా థియేటర్ల యజమానులు బంద్ పాటించాలని నిర్ణయించారు. డిజిటలైజేషన్‌లో భాగంగా క్యూబ్ చార్జెస్ అధికంగా వసూలు చేస్తున్నారు. దాంతో వాటిని 25శాతం మేర తగ్గించాలని థియేటర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. అయితే యుఎఫ్‌ఒ, క్యూబ్ యజమానులు 8.5 శాతం మాత్రమే తగ్గిస్తామని చెప్పారు. దాంతో సంతృప్తి చెందని యాక్షన్ కమిటీ వచ్చే నెల 2 నుంచి దక్షిణాదిలోని అన్ని సినిమా హాళ్ల యజమానులు బంద్ పాటించాలని ఆదేశించిన్నట్లు తెలుస్తోంది.

Cinema Theaters Bandh from March 2nd in South India.