Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కళ తప్పిన కళారంగం..!

Cinema-Theater

స్మార్ట్ ఫోన్‌ల రాకతో థియేటర్లకు తగ్గిన ప్రాధాన్యత
సినిమా రంగాన్ని కుదిపేస్తున్న పైరసీ భూతం
ఇబ్బందులు పడుతున్న థియేటర్ యాజమానులు

హుజూరాబాద్‌టౌన్: కళారంగం రోజురోజూకి కళ తప్పుతుంది. ఒకప్పుడు సినిమా థియేటర్లకు ఎనలేని క్రేజి ఉండేది. కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే జనాలు క్యూ కట్టేవారు. దీంతో సినిమా థియేటర్ల మందు సందడి నెలకొనేది. థియేటర్ల యాజమానులు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలను తెస్తూ లాభపడేవారు. కానీ రోజులు మారాయి. స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రావడంతో సినిమా థియేటర్లపై పెను ప్రభావాన్ని పడింది. కొత్త సినిమాల రివ్యూలు, ట్రైలర్‌లు యూట్యూబ్‌లో వస్తుండటంతో సినిమా థియేటర్లకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి తోడు సినిమా రంగాన్ని పైరసీ భూతాన్ని కుదిపేస్తోంది. కొత్తగా రిలీజ్ అయినా సినిమాలు వారం రోజుల్లోనే ఇంటర్నెట్‌లలో సినిమాలు వస్తుండటంతో థియేటర్లకు జనాలు రావడం మానేశారు. దీనికి తోడు థియేటర్ యజమానులు సైతం టిక్కెట్ ధరలను పెంచేయడంతో సినీ ప్రేక్షకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒకప్పుడు రూ. 50లు దాటని బాల్కనీ టిక్కెట్ ఇప్పుడు రూ. 100లకు పై చిలుకు ఉంది. సినిమా థియేటర్‌లో రోజూకి నాలుగు షోలు నడుస్తాయి. కరెంట్ బిల్లుకు రోజూకు రూ. 4 వేలకు పైగా వస్తుంది. నెలకు లక్ష పైగా కరెంట్ బిల్లు రావడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడలో కూడా థియేటర్ యజమానులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుంది. పైరసీ భూతాన్ని అరికడితే థియేటర్ యాజమానులు కొంతమేర ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

Comments

comments