Home ఖమ్మం కారేపల్లిలో ఉద్రిక్తత

కారేపల్లిలో ఉద్రిక్తత

సిఐటియు కార్యకర్తలపై ఎంఎల్‌ఎ మదన్‌లాల్ అనుచరుల దాడి!
కారుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపిన సిఐటియు నాయకులు

kmm2కారేపల్లి: వైరా శాసన సభ్యులు బాణోత్ మదన్‌లాల్ సమక్షంలో సిఐటియు కార్యక ర్తలపై ఎంఎల్‌ఎ అనుచరులు బస్‌స్టాండ్ సెంటర్‌లో శనివారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సిపిఎం మండల కార్యదర్శి, సిఐ టియు నాయకులు కొంబోయిన నాగే శ్వరరావు, అతని కుమారుడు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు జ్యోతి బస్సులకు గాయాలయ్యాయి. వివరాలల్లోకి వెళితే… కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లోని గణేష్ మండపం పక్కనే గత 24 రోజుల నుంచి ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఆశా వర్కర్లు మదన్‌లాల్‌కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందచేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమ్మె విరమిస్తే సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపిందని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి ఆశా వర్కర్ల సమస్యను తీసుకెళ తానని ఆయన హామీ ఇచ్చారు. కాగా పంచాయతీ కార్మికులు తమ సమస్యలపై వినతి పత్రం ఇవ్వటానికి వచ్చారు. శాసన సభ సమావేశాలల్లో ఆశా, జీపి వర్కర్ల సమస్యలను లేవనెత్తాలని డిమాండ్ చేశారు. దీంతో మదన్‌లాల్ రాజకీయం చేయవద్దంటూ అనటంతో సిఐటియు నేత కె. నరేందర్ రాజకీయం చేయటం లేదని, సమస్యలను గుర్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరులు గోడవకు దిగారు. ఎమ్మెల్యేను ప్రశ్నించటానికి మీరు ఎవరు…? అంటూ సిపిఎం నాయకులను నెట్టారు. దీంతో సిపిఎం మండల కార్యదర్శి కొండబోయిన నాగేశ్వరరావు, సిఐటియు నేత నరేందర్ ఎమ్మెల్యే కారుకు అడ్డుగా పడుకున్నాడు. కారు డ్రైవర్ కారును వెనుకకు నడిపిం చడంతో కొంత దూరం వరకు రోడ్డుపైనే వారు ఈడ్చుకొని పోయారు. ఎమ్మెల్యే అనుచరులు మండెపూడి సత్యనారాయణ, రావూరి శ్రీనివాస్‌రావు, కొండ బోయిన నాగేశ్వరరావు, జ్యోతిబస్సు, నరేందర్‌ను కొట్టారు. దీంతో జ్యోతిబస్సుకు ఛాతిపై గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అక్కడి నుంచి ఎంఎల్‌ఎ అతని అనుచరులు వెనుదిరిగి వెళ్ళిపోయారు.
దాడులకు పాల్పడడం సరికాదు
ఎంఎల్‌ఎ మదన్‌లాల్ అనుచరులు మండలంలో రౌడీయిజానికి దిగుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి కొండబోయిన నాగేశ్వరరావు ఆరోపించారు.
గతంలో కూడా ఎమ్మెల్యే అనుచరు లమంటూ హాల్‌చల్ చేశారన్నారు. అధికార పార్టీలో ఉండి పదిమందికి న్యాయం చేయాల్సిన నాయకులే ఇలా బజారులో రౌడీల్లాగా ప్రవర్తించడం సబబు కాదనన్నారు.