Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మత్తుకు చిత్తవుతున్న యువత

somkingనగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు
రాత్రి పది గంటలు దాటితే యథేచ్ఛగా విక్రయాలు
రైల్వేస్టేషన్, అడ్డాలు, ఉన్నత విద్యాసంస్థలే లక్షంగా వ్యాపారం
సంపాదన కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు యువతను బలి తీసుకుంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నగరంలోకి మత్తు పదార్ధాలను తీసుకొస్తున్న కొందరు వ్యక్తులు ఆటో అడ్డాలు, విద్యా సంస్థలు, హాస్టళ్లను లక్షంగా చేసుకుని విక్రయిస్తున్నారు. రాత్రి సమయాల్లో అత్యంత గుట్టుగా సాగుతున్న వ్యాపారం యువతను మత్తుకు బానిసలను చేసున్నారు. ఇప్పటికే నిర్దేశిత సమయానికి మత్తు పుచ్చుకోకపోతే కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నట్లు సమాచారం.

 ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలోని కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో గంజాయితో పాటు హెరాన్ లాంటి మత్తు పదార్థాలను జోరుగా విక్రయిస్తున్నారు. రోజువారి కొనుగోలుదారులను ఏర్పాటు చేసుకున్నవీరు తమ వ్యాపారాన్ని అత్యంత గుట్టుగా నిర్వహి స్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న ఈ మత్తు పదార్థాలను నగరంలోని కాల్వొడ్డు, ఎఫ్‌సిఐ బైపాస్, రాపర్తి నగర్, నాగార్జున సాగర్ కాల్వ, బైపాస్, గొల్లగూడెం రోడ్డు తదితర ప్రాంతాల్లో రాత్రి పది గంటల తర్వాత విక్రయిస్తున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఆటో వర్కర్లు, ఉన్నత విద్యను అభ్యస్తున్న సంస్థల విద్యార్థులే లక్షంగా విక్రయాలు జరుపుతారు. రాత్రి పది గంటల సమయంలో నగరంలోకి ఈ ముఠా రాగానే నిర్మానుష ప్రదేశంలోకి చేరు కుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వారు అక్కడికి చేరుకోగానే గంజాయి, ఇతర పదార్ధాలను విక్రయిస్తున్నారు. గంజా యి, హెరానతో పాటు మత్తు పదార్థాలను కలిపిన సిగరెట్లును కూడా విక్రయిస్తున్నారు. నిర్మానుష ప్రదేశాల్లో మత్తు పదార్థాల స్వీకరణ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంచి తర్వాత బయటకు పంపిస్తున్నారు. గొల్లగూడెం రోడ్‌లోని నిర్మానుష ప్రాంతం పదకొండు గంటల తర్వాత గంజాయి పొగలు లేస్తున్నాయి. మత్తుకు బానిసలైన ఉన్నత విద్యా వంతులు ఇక్కడకు ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. గతంలో కొన్ని ప్రాంతాలలో గంజాయి విక్రయాలు జరిపినా ఈ స్థాయిలో జరగ లేదు. మత్తును ఎరగా చూపి లక్షలు దండుకుంటున్నారు. ఆటో వర్కర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు రోజు సంపాదించినదంతా మత్తులకు అలవాటు పడి పోగొట్టుకుంటున్నారు. వీరి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాపారం లాభ సాటిగా ఉండడంతో గతంలో గుట్కా ఇతర నిషేధిత పదార్థాలను విక్రయించే కొంతమంది ఈ వ్యాపారం వైపు చూస్తున్నారు. జిల్లా యంత్రాంగం దీనిని అరికట్టక పోతే అత్యంత గుట్టుగా రోజుకొక పద్ధతిలో సాగుతున్న ఈ మత్తు పదార్థాల విక్ర యాలను అరికట్టి వందలాది మంది యువకుల భవితను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments