Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మచిలీపట్నంలో అనిల్‌కుంబ్లే సందడి

Machilipatnam : CK Nayudu Statue Discovery by Anil Kumble

మచిలీపట్నం : భారత్ క్రికెట్ జట్టు మొట్టమొదటి కెప్టెన్ దివంగత సికె నాయుడు విగ్రహాన్ని భారత క్రికెట్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మంగళవారం ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అనిల్ కుంబ్లే 13 ఎకరాల్లో రూ.15 కోట్లతో నిర్మించతలపెట్టిన అథ్లెటిక్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్‌లో సికె నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎపి క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ ఎండి బంగార్రాజు, శాప్ చైర్మన్ వెంకన్న చౌదరి, ఎంఎల్‌సి బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

CK Nayudu Statue Discovery by Anil Kumble at Machilipatnam

Comments

comments