Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రియురాలితో గొడవపడి ఆత్మహత్యాయత్నం..!

HANGINGహైదరాబాద్ : సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషణ్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా విజవాడకు చెందిన మహ్మద్ రఫీ (29) పోలీస్ శాఖలో అటెండర్ విధులు నిర్వహించేవాడు. అయితే ఏడాదిన్నర క్రితం సస్పెండ అయ్యాడు. రఫీకి కరీంనగర్‌కు చెందిన కవిత అనే బీ-ఫార్మసీ చదివిన మహిళ పరిచయమైంది. వీరిద్దరూ ప్రేమించుకుని గత రెండేళ్లుగా పంజాగుట్ట దుర్గానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరి మధ్య స్వల్ప గొడవలు జరగడంతో గురువారం కవిత తన ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధపడింది. రఫీ వద్దని వారించినా వినకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి బయట వున్న కవిత ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు పగులగొట్టి అతన్ని కిందకు దింపి సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రఫీ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments