Home జాతీయ వార్తలు ఇంద్రపురిలో విద్యార్థిని ఆత్మహత్య…

ఇంద్రపురిలో విద్యార్థిని ఆత్మహత్య…

Student Suicideన్యూఢిల్లీ: టీచర్ రోజు తిడుతోందని ఓ విద్యార్థిని మనస్తాపం చెంది… బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో జరిగింది. డిసెంబర్ 1వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… 12 ఏళ్ల విద్యార్థిని డిసెంబర్ ఒకటో తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమ్మా ఐ లవ్యూ… ఈ లోకాన్ని విడిచి పోతున్నా… అని యువతి తన చేతిమీద రాసి ఉండటాన్నిపోలీసులు గుర్తించారు. ఆమె తల్లి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తుంది. తల్లి కోర్టుకు వెళ్లి వచ్చేసరికి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని తల్లి ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ… తన కూతురిని స్కూల్లో ఓ టీచర్ తరుచూ తిడుతూ ఉండేదని… శుక్రవారం కూడా క్లాస్ టీచర్ విద్యార్థుల ముందే తిట్టడంతో తన కూతురు తీవ్రంగా బాధపడిందని ఆమె తెలిపింది. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు బాలిక చదువుతున్న స్కూల్ యాజమాన్యం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసి అంతర్గత విచారణ చేపట్టినట్టు సమాచారం.

student-suicide

Class 7 Student Committed Suicide in Delhi