Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

క్లాస్, మాస్‌ను ఆకట్టుకునే   కృష్ణాష్టమి

sunilసునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. “ఫిబ్రవరి మొదటి వారంలో ‘స్పీడున్నోడు’, రెండవ వారంలో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలు రిలీజవుతుండడంతో మా చిత్రాన్ని వాయిదావేశాం. చివరికి ఫిబ్రవరి 19న సినిమాను విడుదల చేయనున్నాం”అని అన్నారు. దర్శకుడు వాసువర్మ మాట్లాడుతూ “ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమిది. సునీల్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో పాటు, అటు క్లాస్‌ని ఇటు మాస్‌ని ఆకట్టుకునే ఫ్యామిలీ వ్యాల్యూస్ ఈ చిత్రంలో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది మెయిన్ పాయింట్‌”అని తెలిపారు. సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీః చోటా కె.నాయుడు, ఎడిటర్‌ః గౌతంరాజు, సంగీతంః దినేష్, కథః శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం, ఫైట్స్‌ః అనల్ అరసు, ఆర్ట్‌ః ఎస్.రవీందర్.

Comments

comments