Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

collector

మార్చి 15 నుండి ఎప్రిల్ 2వరకు 10వ తరగతి
వార్షిక పరీక్షల నిర్వాహణ..
జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు…కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: కలెక్టర్ శ్వేతామహంతి…

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి కాపీ యింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందిగా నిర్వహించాలని కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. శనివారం ఆమె తన గదిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు సమీక్షించారు. మార్చి 15 నుండి ఎప్రిల్ 2వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు గట్టి బం దోబస్త్ ఏర్పాటు చేయాలని ,144వ సెక్షన్ విధించాలని ప్లైయింగ్ స్కా డ్స్‌ను ఏర్పాటు చేయాలని, పరీక్షలు నిర్వహించే రోజున జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ,అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స సౌకర్యం ఏర్పాటు చేయాలని పరీక్షల రోజున మారుమూల ప్రాం తాల నుండి విద్యార్థులు పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీ రు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యుత్ అంతరాయం కల్గకుండా చూడాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు:డిఈఒ సుశీందర్‌రావు
ఈ సంవత్సరం నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా 7815 మంది రెగ్యులర్ విద్యార్థులు, 443 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షలు మార్చి 15 నుండి ఎప్రిల్ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు ఉంటాయని డిఈఒ సుశీందర్ రావు వెల్లడించారు. పరీక్షల సక్రమ నిర్వహణకు గాను ఆయా శాఖల అధికారులు తగు సహకారంఅందించాలని కోరారు.
సమావేశంలో అదన పు ఎస్పీ సురేందర్ రెడ్డి ,డిఆర్‌ఒ చంద్రయ్య, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ చంద్రారెడ్డి, డిపిఒ వీరబుచ్చయ్య, మున్సిపల్ కమీషనర్ రజనీకాంత్, డిఎంహెచ్‌ఒ డా. శ్రీనివాసులు, డిటిఒ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments