Home తాజా వార్తలు చెరువులను తోడేస్తున్నారు

చెరువులను తోడేస్తున్నారు

మట్టితవ్వకాలతో పనికి రాకుండా పోతున్న చెరువులు, కుంటలు
ప్రమాద భరితంగా గోతులు
పట్టించుకోని మైనింగ్ అధికారులు

 

మనతెలంగాణ/పెద్దవంగర: ప్రకృతి సంపద పరిరక్షణ కోసం ప్రభుత్వం వాల్టా చట్టాన్ని అమలు చేస్తున్న పలుకుబడి ఉన్నా వారికి ఆ చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. వారి పలుకుబడితో చెరువులు, కుంటల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలను జరుపుతూ ప్రజల పాణాలతో చెలగాటమాడుతున్నారు. మామూళ్లతో అధికారులను కట్టి పడేసి ఇష్టానుసారంగా చెరువులు, కుంటల్లో మట్టిని కొల్లగోడుతున్నారు. గోతులు తవ్వి వందల ట్రాక్టర్ల మట్టిని తరలిస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ఫలితంగా నీటి వనరులైన చెరువులు, కుంటలన్ని ఛిద్రమై రైతులకు పనికి రాకుండా పోతున్నాయి. చెరువుల నుంచి మట్టిని తరలించోద్దంటూ ఆయకట్టు రైతులు మొర పెట్టుకుంటున్నా పట్టించుకునే నాథూడే కరువయ్యారు. పెద్దవంగర మండల పరిధిలోని కోరిపల్లి చెరువు నుంచి ప్రొక్లైయినర్‌తో ట్రాక్టర్‌లలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టి తరలింపుపై ఆయకట్టు రైతులు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

అధికారుల అండదండలతోనే చెరువులు, కుంటల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టిని ఇష్టారాజ్యంగా తరలించడంతో చెరువులు, కుంటలలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఆయకట్టు భూముల ఒక్కో చెరువు 5 మీటర్ల లోతుకు చెరుకున్నాయి. ఫలితంగా వర్షాలకు చెరువులు, కుంటలు నిండినా ఆ నీరు ఆయకట్టు భూములకు అందడం లేదు. అదికాకా గ్రామంలోని చెరువులోని సారవంతమైన మట్టి తీసుకెళ్లడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలేత్తే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నాట్లు తెలుస్తున్నది. ఇటివల మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువును పునరుధ్ధరించి చేసిన మట్టి మాఫియా ట్రాక్టర్లను పెట్టి మట్టిని తరలిస్తుండడంతో కట్ట పూర్తిగా బిటాలు వారి కుంగిపోయే పరిస్థితి వచ్చింది. వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో ప్రోక్లైయినర్‌ను గ్రామస్థుల అడ్డకున్నారు. మట్టిని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

Clay Mafia Running in Lake in Peddavangara