Home జిల్లాలు మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం

1వచ్చే ఏడాది.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధిస్తాం
నగర మేయర్ బొంతు రామ్మోహన్

సిటీబ్యూరో : వచ్చే ఎడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే గణేష్ విగ్రహాలను నిషేదించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. పర్యావరణ హితమైన మట్టి గణేష్‌లనే పూజించాలని మేయర్ నగర వాసులకు పిలుపునిచ్చారు. సోమవారం సేవ్ సంస్థ ఆధ్వర్యంలో నార్సింగ్ వద్ద తయారు చేస్తున్న మట్టి గణపతుల విగ్రహాలను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణానికి తీవ్రమైన నష్టం కల్గించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంతో నగరంలోని చెరువులు, కుంటలు కాలుష్యం బారీన పడ్డాయని, దీంతో పక్షులు, చెపలు ఉనికి పూర్తిగా కనుమరుగైందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 169 చెరువులను దశల వారిగా పూర్తి స్థాయిలో అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రస్తుతం 10 కోలనులను ప్రత్యేకంగా నిర్మింస్తున్నారమన్నారు. హైదరాబాద్ నగరంలో మట్టి వినాయకుల తయారికి ఆసక్తి కనబరిచే వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. మట్టి విగ్రహాలను తయారి వల్ల వృత్తి దారులకు పూర్తి స్థాయిలో ఉపాధి కలిగే అవకాశం ఉంటుందన్నారు. నగరంలో ప్రజాప్రతినిధులు గణేష్ విగ్రహాల కోసం చందాలు ఇవ్వకుండా మట్టి విగ్రహాలను బహుకరించాలన్నారు. గత ఐదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి, పంపిణి చేస్తున్న సేవ్ సంస్థ నిర్వహకులు విజయరావ్‌ను మేయర్ అభినంధించారు.