Home జిల్లాలు ఇక నుంచి క్లీన్ సంగారెడ్డి

ఇక నుంచి క్లీన్ సంగారెడ్డి

పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
ఇందుకు సభ్యులంతా సహకరించాలి
అక్రమ నిర్మాణాలు ఆపాల్సిందే
షాపింగ్ కాంప్లెక్సు పనులకు రూ.25 లక్షలు
జిల్లా కలెక్టర్ రొనాల్డ్

medak1సంగారెడ్డి: అయిందేదో అయింది..ఇక నుంచైనా సంగారెడ్డిని క్లీన్ సిటీగా చేద్దాం.. అంతా సమన్వయంతో పనిచేస్తే అదేమంత కష్టం కాదు.. సంగారెడ్డి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో కదులుదాం.. అని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. ఇంతుకుముందు తనిఖీతో హడలెత్తిం చిన జిల్లా కలెక్టర్ గురువారం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి ఏమేం చేయాలనే అంశంపై అభిప్రా యాలు అడిగారు. అక్రమ నిర్మాణాలపై ఎన్ని నోటీస్‌లిచ్చారు? వాటిపై ఏమేం చర్యలు తీసుకున్నారు..? అని కలెక్టర్ అడిగినా టౌన్ ప్లానింగ్ అధికారులు నోరు మెదపలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని, దీనికి సభ్యులంతా సహకరించాలని అన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, వసతులు, కల్పించాల్సి న అవసరముందని, తద్వారా మంచి పనులు చేశారనే పేరు కౌన్సిల్‌కు వస్తుందన్నారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాలకు సరిపడా ప్రణాళి కతో ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ ఆర్‌జెడి ఇటీవల సంగారెడ్డిలో పర్యటించడం జరి గిందన్నారు. పట్టణంలో శానిటేషన్ ప్రక్రియను చేపట్టి పర్యవేక్షిస్తామని, చెత్తా చెదారం ఎక్కడా లేకుండా చేస్తామని, దీనికి గాను వార్డుల వారీగా ప్రణాళికబద్దంగా వెళ్తామని, డంపుయార్డు స్థలం గుర్తించాలని, మరుగు దొడ్లు మంజూరయ్యాయని, వాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయాలని అన్నారు. ఆస్తిపన్ను, నల్లాపన్ను, వినోదపన్ను వసూళ్లు లక్షం మేరకు జరగాలన్నారు. మున్సిపల్ స్థలాల అక్రమణపై సీరియస్‌గా ఉండాలని, అక్రమ నిర్మాణాలను ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా సంగారెడ్డి క్లీన్ ఎలా ఉంటుందో చూపు దామన్నారు.

ప్రతి ఇంటికీ నంబరింగ్ వేసేందుకు, మరింత మెరుగ్గా తాగు నీటిని అందిం చేందుకు కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సు టెండర్ల గడువు పూర్తయి ఉంటే..వెంటనే టెండర్లు పిలవా లన్నారు. పట్టణంలోని జంక్షన్ల అభివృద్ధికి, పార్కింగ్ స్థలాల గుర్తింపునకు వెండింగ్ జోన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామ న్నారు. పట్టణంలోని అసంపూర్తి షాపింగ్ కాంప్లెక్సు పూర్తికి రూ.25 లక్షలు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ఇన్‌చిర్జి కమిషనర్‌గా ఉన్న జడ్‌పి సిఇఓ ఓజె మధు, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ గోవర్దన్, వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.