Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నిరుపయోగంగా ‘చెత్త’ రిక్షాలు

Clean the villages In the Swaccha bharat

పారిశుద్ధ్యం పేరిట నిధులుదుర్వినియోగం
సరఫరా చేసారు.. వినియోగం మరిచారు
ఎలా వినియోగించాలోతెలియక అయోమయంలో సర్పంచ్‌లు

స్వచ్ఛభారత్ పేరులో ఉన్నంత స్వచ్ఛత ఆచరణలో కరువైంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త తరలించేందుకు ప్రతి గ్రామ పంచాయతీలకు రిక్షాలను అధికారులు సరఫరా చేశారు. అయితే అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల సర్పంచ్‌లు ఎలా వినియోగించాలో తెలియక గ్రామాల్లో నిరుపయోగంగా మారాయి. దీంతో లక్షలాది రూపాయల ప్రజాదనం చెత్త పాలు చేశారు.

మన తెలంగాణ/కోడేరు: కేంద్ర ప్రభుత్వం చెపట్టిన స్వచ్ఛభారత్‌లో భాగంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి గ్రామపంచాయతీకి జనాభా ప్రాతిపాధికన అధికారులు రిక్షాలను పంపిణీ చెశారు. వీటిని ఆయా గ్రామపంచాయతీలకు పంపిణీ చేసినా వాటి వినియోగంపై మార్గదర్శకాలు మాత్రం మరిచారు. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, గ్రామాల్లో రిక్షాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటి వినియోగానికి గ్రామ పంచాయతీ నిధులు లేక ఉపాధిహామీ ద్వారా చెత్తను ఎలా సేకరించాలో తెలియక అయోమయంలో సర్పంచులు ఉన్నారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఓ రిక్షా చొప్పున పంపిణీ చేశారు. మండల కేందాలల్లో 5 చొప్పున , పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే 4, చిన్న గ్రామ పంచాయతీలకు 2 లేదా 3 చొప్పున పంపిణీ చేశారు. వీటి నిర్వహణకు నిధుల మాటేమిటని సర్పంచ్‌లు పశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీలల్లో ఉన్న నిధులతో ప్ర స్తుత అవసరాలు తీరడం లేదు. చెత్త తరలించేందుకు గ్రామ పంచాయతీలల్లో సిబ్బంది లేరు. దీంతో వీటి వినియోగం భారంగా మారుతుం దంటున్నారు సర్పంచులు. ఇలా సేకరించిన చెత్తను తరలించేందుకు గ్రామాలల్లో డంపింగ్ యార్డులు లేవు. దీంతో సేకరించే చెత్తను ఎక్కడ వేయా లో అయోమయంగా మారింది.
ఉపాధిహామీ ద్వారా అమలు అన్నారు… కోడేరు మండల సర్వ సభ్య సమావేశంలో చెత్త తరలించే రిక్షాల ప్రస్తావన గతంలో వచ్చింది. ప్రతి గ్రామంలో చెత్త తరలించేందుకు అవసరమైన కూళీలకు ఉపాధిహామీ ద్వారానే కూలీ చెల్లిస్తామన్నారు. కాని ఇప్పటి వరకు సర్పంచ్‌లకు ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో వృథాగా రిక్షాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకన్నా ఉపాధిహామీ పథకం ద్వారా వీటిని వినియోగంలోకి తేవాలని , ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. రానున్నది వర్షాకాలం: రానున్నది వర్షాకాలం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండి రోగాలకు కారణం అవుతాయి. గ్రామాల్లో ఇళ్ల మధ్య వేస్తున్న చెత్తచెదారాల్లో వర్షపు నీరు చేరి రోగాలు వచ్చే వీలుంది. వీటి వల్ల దోమల వ్యాప్తి పెరుగును. ఇప్పటికైనా అధికారులు, సర్పంచ్‌లు స్పందించి గ్రామాల్లో చెత్తను తరలించే ఏర్పాటు చేయాలి.

వినియోగంపైసమాచారం లేదు : అంజల్‌గౌడ్ సర్పంచ్ ముత్తిరెడ్డిపల్లి అధికారులు చెత్త తరలించేందుకు రిక్షాలను సరఫరా చెశారు. గ్రామంలో చెత్త సేకరణపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో రిక్షాలు వృథాగా ఉన్నాయి. వీటికి ఏ నిధులను వినియోగించాలో అధికారులు స్పష్టత ఇచ్చి వినియోగంలోకి తీసుకురావాలి.

వినియోగంలోకి తెస్తాం…
పారిశుద్ధ్యానికి ఉపమోగించే రిక్షాలను వినిమోగించేలా చర్యలు తీసుకుంటాం. గ్రామాలల్లో డంపింగ్ యార్డులు లేకపోవడవ వల్లనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెత్తను సేకరించి ఎక్కడకి తరలించాలో సర్పంచులతో చర్చించి వినియోగంలోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

Comments

comments