Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

గ్రామాలలో ఎక్కడి చెత్త అక్కడే

 Clean up sewerage in villages

తాండూరు రూరల్ / మన తెలంగాణ : వర్షాకాలం మొదలై 15 రోజులు గడుస్తున్నా గ్రామాలలో మురుగు కాల్వలు శుభ్రపరిచి వాటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లక పారిశుభ్రతపై కన్నేయని గ్రామ పంచాయతీ కార్యదర్శులు.  తాండూరు మండల పరిధిలోని  25 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు, తండాలు ఉన్నా ప్రజలు అంటు వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కానీ  పంచాయతీ కార్యదరులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడం ముందుస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అంటు వ్యాధులకు గురై ఆస్పత్రులకు డబ్బులు కట్టక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతి గ్రామానికి ప్రతి రోజూ వచ్చి  పంచాయతీ కార్యాలయంలో హెల్త్ అధికారి ఆయా గ్రామాలలో ఉండి గోళీలను, సూదీమందులను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ వ్యాధులుకు గురై ప్రభుత్వ ఆస్పత్రుల పాలవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆయాగ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో కొత్త నీరు చేరడం వల్ల నీటిలో వచ్చే క్రిములతో మలేరియా, టైఫాయిడ్, డయేరియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

వర్షాకాలం ప్రారంభం నాటి నుండి తాగునీటి ట్యాంకులు, బోరుబావులు తదితర నీటి వనరులను అధికారులు బ్లీచింగ్ పౌడర్‌తో పరిశుభ్ర పరంచాలి. కానీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీనికి తోడు వైద్య,ఆరోగ్య, పంచాయతీరాజ్  శాఖల సమన్వయం లోపించడంతో గ్రామాలపై కన్నెత్తి చూడక పోవడంతో అంటు వ్యాధులు సోకడానికి కారణం చెప్పవచ్చు. వీరి నిర్లక్షం కారణంగా గత 15 రోజుల నుండి తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పలు వ్యాధులతో ఆస్పత్రిలో చేరారు. పంచాయతీల్లో పారిశుద్ధం పడకేయడంతో ఇందుకు కారణమని తెలియవస్తుంది. పంచాయతీలలో పైప్‌లైన్ లీకేజీలతో మరమ్మతులు చేయడంలో నిర్లక్ష దొరణి అవలంభిస్తున్నారు.దీంతో విధిలేని పరిస్థితుల్లో కలుషిత మంచి నీటిని తాగి వ్యాంధులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గత 15 రోజుల వ్యవధిలో తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో తాండూరు మండల ప్రజలు ఇప్పటి వరకు వంద మందికి పై గా ఆస్పత్రి పాలవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దోమలు రాత్రి వేళల్లో విజృంభించడంతో అంటు వ్యాధులు మలేరియా, టైఫాయిడ్ వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments