Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఫలితాలెన్నాడు? ప్రవేశాలెప్పుడు?

Clearance when it will be announced

వెల్లడి కాని నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు                                                                                                              ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టత కరువు                                                                                                                    ఇతర రాష్ట్రాల్లో విడుదల                                                                                                                                            విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

మన తెలంగాణ/పెద్దశంకరంపేట : మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి సిద్దిపేట జిల్లా వర్గల్‌లో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. ఈ విద్యాలయంలో 6వ తరగతిలో 80 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ 80 సీట్ల కోసం కేవలం మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 2 వేల 026 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏప్రిల్ నెల 21వ తేదిన మెదక్ జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రవేశ పరీక్షను నిర్వహించారు. మొత్తం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో అశ్రమ వసతులతో ఉచిత విద్యనందిస్తున్న నవోదయ విద్యాలయంలో వి ద్యాభ్యాసం అంటే విద్యార్థుల భవిష్యత్తుకు చక్కని మా ర్గంగా తల్లిదండ్రులు భావిస్తారు. వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేశారు. ఏప్రిల్ నెల 21వ తేదిన ఎం ట్రన్స్ నిర్వహించారు. ప్రవేశ పరీక్షను నవోదయ విద్యాలయ సమితి అధికారులు నిర్వహించగా, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) అధికారులు ప్రశ్న పత్రాలు వాల్యుయేషన్ చేసి ఫలితాలను వెల్ల డిస్తారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి మూడు నెలలు గడిచినా ఫలితాలను విద్యాలయ సమితి విడుదల చేయ డం లేదు. ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత కూడా లేకపోవడంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ప్రవేశ పరీక్ష ఆలస్యంతో మరింత జాప్యం : నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో చేపడతున్న ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఒకేసారి ప్రవేశ పరీక్షను నిర్వహించాలనే నిర్ణయంతో ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన పరీక్షను ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. తొమ్మిదో తరగతి ఖాళీల భర్తీకి సైతం గతంలో మే నెలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు పదిహేను రోజుల్లో విడుదల కావల్సి ఉండగా రెండు నెలలు గడిచినా ఫలితాలు విడుదల చేయకపోవడంతో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. రెండేళ్లుగా విద్యాలయ సమితి అధ్వర్యంలో జనవరి రెండో వారంలోనే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పద్ధతిలో ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదిన విద్యాసంవత్సరం ఆరంభమవుతోంది. అ ప్పటిలోగానే ఫలితాలు వెలువరిస్తే ఉత్తీర్ణులు కానీ విద్యార్థులు ఇతర విద్యాసంస్థలలో చేరే అవకాశం ఉంటుంది.

న్యూఢిల్లీ నుంచే ఎంపిక ప్రక్రియ : ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలను సిబిఎస్‌ఇ అధికారులు విడుదల చేయాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ లోని కార్యాలయం నుంచి దేశంలోని అన్ని నవోదయలకు చెందిన ఫలితా లు విడుదల చేస్తారు. సంబంధిత విద్యాలయాలకు ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. పరీక్ష నిర్వహణ వరకు విద్యాలయ సమితి పనితీరు బాగానే ఉన్నా ఫలితాల విషయం వచ్చేసరికి తాత్సారం చేస్తున్నారు.

వెంటనే విడుదల చేయాలి : నవోదయ ఫలితాలను సిబిఎస్‌ఇ వెంటనే విడుదల చేయాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నవోదయ పట్ల సమాజంలో ఉన్న మంచి పేరుకు మచ్చపడేలా సిబిఎస్‌ఇ వ్యవహరించడం బాధాకరమని వారంటున్నారు. ఫలితాలు జాప్యం కావడంతో చాలా మంది ఇతర పాఠశాలల్లో చేరిపోయారు. సీటు వస్తే మాత్రం ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన వారు తీవ్రంగా నష్టపోవడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.

Comments

comments