Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

చెట్టెక్కు సిగ్నల్ పట్టు

Tree

మన తెలంగాణ/పెంబి: ఈ ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ప్రతీ ఒక్కరికీ అలవాటైంది. ఒక్క నిమిషం సిగ్నల్స్ లేనిదే కాలం గడువని ఈ యుగంలో మండలంలోని కొన్ని గ్రామాల్లో సిగ్నల్స్ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతీ రోజు సిగ్నల్స్ లేనిదే ఏ ఒక్క పని ఆఫీస్‌ల్లో కూడా పని జరగడం కష్టంగా మారింది. అలాంటిది మండలంలోని గ్రామాలలో మందపెల్లి, గుమ్మన ఎగ్లపూర్, పస్పుల, లింగంపోచంపాడ్ తదితర గ్రామాల్లో సిగ్నల్స్ రావాలంటే చెట్లు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థతి నెలకొంది. ఈ మధ్యన ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఆన్‌లైన్ లో రెషన్ బియ్యం అందజేస్తుంది.

ఇంత వరకు బాగానే ఉన్న రేషన్ డీలర్స్ సిగ్నల్ లేక చెట్టు ఎక్కు సిగ్నల్ పట్టు అనే పరిస్థితి నెలకొంది. మండలకేంద్రానికి మూడు కిలో మిటర్ల దూ రంలో ఉన్న మందపెల్లిలో ఆన్‌లైన్‌లో రేషన్ బియ్యం ఇవ్వడానికి రేషన్ డీలర్లు సిగ్నల్స్ కోసం చెట్టు ఎక్కే పరిస్థితి నెలకొంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, పట్టించుకున్నా హామీలతో సరిపెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సిగ్నల్ కోసం ఆయా గ్రామాల్లో టవర్లు వేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments