Home తాజా వార్తలు మోడీ మెప్పు కోసం కెసిఆర్ చండీ యాగం : జీవన్ రెడ్డి

మోడీ మెప్పు కోసం కెసిఆర్ చండీ యాగం : జీవన్ రెడ్డి

Jeevan-Reddyకరీంనగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెప్పు కోసమే సిఎం కెసిఆర్ చండీ యాగం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగించిన జీవన్ రెడ్డి ఢిల్లీలోని కేరళ భవన్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆహార అలవాట్ల పై దాడులు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల మతవిద్వేషాలు చెలరేగుతాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ఆంశం పై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.