Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రజలు నాపై విశ్వాసం చూపారు: బాబు

CHANDRABABU-

అమరావతి: నంద్యాల, కాకినాడ ఫలితాలతో ప్రజల నాడి తెలిసిందని, ఇకపై మరింత బాధ్యతతో వ్యవహరిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో టిడిపి పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టిడిపి నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు  స్వీట్లు తినిపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. కుల రాజకీయాలు చేద్దామనుకున్న వైసిపి ఆటలు సాగలేదని మండిపడ్డారు. విభజన తరువాత ప్రజలు తనపై విశ్వాసం చూపారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని అరాచకాన్ని వైసిపి సృష్టించిందని, కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు ఆందోళన చేసిన వైసిపి నేతలు తరువాత సైలెంట్ అయ్యారని ఎద్దేవ చేశారు

Comments

comments