Home ఆంధ్రప్రదేశ్ వార్తలు నేడు కర్నాటకకు ఎపి సిఎం…

నేడు కర్నాటకకు ఎపి సిఎం…

Chandrababu and Kumaraswamy

అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోరాటాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎన్డియేను అధికారం నుంచి తప్పించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితరులను కలిసి మద్దతు కుడగడుతున్న ఆయన, గురువారం కర్నాటకకు వెళ్లనున్నారు.

బిజెపికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడానికి జెడిఎస్ మద్దతును బాబు కోరనున్నట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు వెళ్లనున్న బాబు, 3 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ కానున్నారు. బెంగళూరు పద్మనాభనగర్ లోని దేవెగౌడ ఇంట్లో ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారం చివరిలో  చంద్రబాబు చెన్నై వెళ్లి డిఎంకె అధినేత స్టాలిన్ తో కూడా పలు కీలకాంశాలపై చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు అవుతున్న ఎపి సిఎం, ఓ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థులను నిలపడం వల్ల, ఎన్డియే ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని జెడిఎస్ కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

CM Chandrababu Naidu Visit to Karnataka

telangana latest news