Home తాజా వార్తలు కెసిఆర్‌, కెటిఆర్‌ మేడే శుభాకాంక్షలు

కెసిఆర్‌, కెటిఆర్‌ మేడే శుభాకాంక్షలు

CM KCRహైదరాబాద్‌ : తెలంగాణ సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని  కార్మికులు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో  కార్మికులు  క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని వారు కొనియాడారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వారు తెలిపారు. కార్మికులు సుభిక్షంగా వర్థిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యమని వారు పేర్కొన్నారు. మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా జరుపుకోవాలని వారు కోరారు.

CM KCR and KTR May Day Greetings to Labour