Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని ఆంధ్రాభిమానుల పూజలు…

కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని ఆంధ్రాభిమానుల పూజలు…

CM KCR Andhra Fansఅమరావతి: సిఎం కెసిఆర్‌కు తెలంగాణతో పాటు ఎపిలోనూ భారీ ఎత్తున అభిమానగణం విషయం తెలిసిందే. ఈ నెలలో తెలంగాణలో జరుగునున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటూ విజయవాడకు చెందిన కెసిఆర్‌ అభిమాని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపించారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కొణిజేటి ఆదినారాయణ అనే అభిమాని.. కెసిఆర్ మళ్లీ సిఎం కావాలంటూ కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘాట్‌రోడ్ సమీపంలో 101 టెంకాయలు కొట్టారు.

ఈ పూజ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన జి.లక్ష్మయ్య, నల్లగొండకు చెందిన ఉప్పునూతల నాగరాజు, సూరిని కార్తీక్‌రెడ్డితో పాటు పలువురు కెసిఆర్‌ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కొణిజేటి మీడియాతో మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారని… ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లి వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రింగా కెసిఆర్ రెండోసారి ప్రమాణం చేసిన వెంటనే తన మొక్కులు తీర్చుకుంటానని ఆదినారాయణ చెప్పారు.