Home తాజా వార్తలు ప్రగతి నివేదన సభ కోసం కమిటీల ప్రకటన

ప్రగతి నివేదన సభ కోసం కమిటీల ప్రకటన

CM KCR announce Committees for Pragathi Nivedana Sabha
హైదరాబాద్: టిఆర్ఎస్ సర్కార్ సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం కమిటీలను ఏర్పాటు చేశారు. సభ నిర్వహణకు సమన్వయ కర్తలుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని, మంత్రులు కెటిఆర్, మహేందర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తారు. కమిటీల వివరాలు ఇలా ఉన్నాయి….

వాలంటీర్స్ కమిటీలో సభ్యులుగా ఎంఎల్ సి శంభీపూర్ రాజు, టిఆర్‌ఎస్‌కెవి అధ్యక్షుడు రాంబాబు యాదవ్, టిఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, చిరుమల్ల రాకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పల్లా ప్రవీణ్ రెడ్డి, ఎం. ధర్మేందర్, బి.దినేశ్ చౌదరి ఉన్నారు. హైదరాబాద్ నగర జన సమీకరణ సమన్వయ కమిటీలో మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్ సి మైనంపల్లి, మాజీ మంత్రి దానం నాగేందర్. అలాగే నగర అలంకార కమిటీలో దానం నాగేందర్, ఎంఎల్ సిలు మైనంపల్లి హన్మంతరావు, ఎంఎస్ ప్రభాకర్, టిఆర్‌ఎస్ నాయకులు బండి రమేశ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉంగా, మంచినీరు, ఇతర సౌకర్యాల కమిటీలో ఎంఎల్ ఎ మాధవరం కృష్ణారావు, ఎంపి మల్లారెడ్డి ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కమిటీలో ఎంఎల్ఎ రసమయి బాలకిషన్, సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, వి.సాయిచంద్ ఉండగా, మీడియా కమిటీలో ఎంపిలు బాల్క సుమన్, బూర నర్సయ్య గౌడ్, ఎంఎల్ సిలు కర్నె ప్రభాకర్, టి.భానుప్రసాద్, మహ్మద్ సలీం, టిఆర్‌ఎస్ నాయకులు గట్టు రాంచందర్‌రావు, పి జగన్మోహన్‌రావు, వై సతీశ్ రెడ్డి ఉన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ కమిటీలో ఎన్.ధర్మేందర్, కర్నాటి విద్యాసాగర్ ఉండగా, సభా ప్రాంగణం, పార్కింగ్ కమిటీలో ఎంఎల్ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టిఎస్‌ఐఐసి చైర్మన్ గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు.