Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

పద్మశాలీల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేస్తాం…

CM Kcr announces 5 crore to padmashali bhavan

హైదరాబాద్: పద్మశాలీల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిఎం కెసిఆర్ అన్నారు. పద్మశాలి భవన నిర్మాణానికి 2.5 ఎకరాల స్థలం, రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో పద్మశాలి సంఘం ప్రముఖులతో కెసిఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి చేయూతను అందించాలని సూచించారు. వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నామ ఉపాధి మార్గాలు చూపలన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేనేత కార్మికులకు శాశ్వత పరిష్కారాలు చూపాలని చెప్పారు. హైదరాబాద్‌లో పద్మశాలి భవనం నిర్మాణానికి నిధులు అందిస్తామని సిఎం పేర్కొన్నారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని తెలిపారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధికి మొదటి విరాళాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వ అందిస్తోందని చెప్పారు. నిధికోసం మొదటి విరాళంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు అందిస్తామన్నారు. పద్మశాలి సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

Comments

comments