Home తాజా వార్తలు హైదరాబాద్‌లో ఎరుకల భవన్ : సిఎం కెసిఆర్

హైదరాబాద్‌లో ఎరుకల భవన్ : సిఎం కెసిఆర్

CM KCR announces Erukula Bhavan at Hyderabad

హైదరాబాద్: ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో తెలంగాణ ఎరుకల సంఘం సభ్యులు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా సిఎం ఎరుకల కులస్థులకు వరాల జల్లు కురిపించారు. ఎరుకల కులస్థుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడే విధంగా హైదరాబాద్ లో భవనం నిర్మించనున్నట్టు సిఎం ప్రకటించారు. ఇందుకు అవసరమైన స్థలంతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఎరుకల కులస్థుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఈ భేటీలో సిఎంను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.