Home రాష్ట్ర వార్తలు సీఎం హమీతో జర్నలిస్టుల సంబురాలు

సీఎం హమీతో జర్నలిస్టుల సంబురాలు

WGLమనతెలంగాణ/హన్మకొండటౌన్ : జర్నలిస్టులకు ‘కెసిఆర్ జర్నలిస్టుల మోడల్ కాలనీ’ నిర్మిస్తామని రాష్ట్రముఖ్యమంత్రి ఇచ్చిన హమీతో బుధవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు స్వీట్లు తినిపించుకుని, బానసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సిఎం కేసిఆర్ జిల్లా పర్యటనలో బాగంగా టియుడబ్లూజే (ఐజేయూ), కేసిఆర్ మ్యూచ్‌వల్లీ హౌజింగ్ సొసైటీ నాయకుల నేతృత్వంలో నందన గార్డెన్‌లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసి వరంగల్ జిల్లాలో పని చేస్తున్న రిపోర్టర్లు, డెస్క్, జర్నలిస్టులు, కెమెరామెన్లు, వీడియో జర్నలిస్టులు, చిన్న పత్రికల రిపోర్టర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులందరికి డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరి చేయాలని వినతి పత్రం సమర్పించారు. వారి వినతికి స్పందించిన సిఎం కేసిఆర్ వరంగల్లో కేసిఆర్ జర్నలిస్టు మోడల్ కాలనీ నిర్మిస్తామని హమీ ఇవ్వడమే కాకుండా తాను ఇంచార్జీగా ఉండి 11 నెలల కాలంలో కాలని నిర్మించి సకల సదుపాయాలు, అత్యాధునిక కాలనీగా, రాష్ట్రాకే మోడల్ కాలనీగా కేసిఆర్ జర్నలిస్టు మోడల్ కాలని ఉంటుందన్నారు. ఇందు కోసం సిఎం ప్రత్యేక నిధి నుంచి నిథులు వెచ్చిస్తామని చెప్పారు. జర్నలిస్టులతో ఒక సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆబాధ్యతను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీసుకోవాలని కోరారు. 50 ఎకరాల స్థలాన్ని చూడవలసిందిగా కలెక్టర్ కరుణ ఆదేశించారు. జర్నలిస్టులు అడుగగానే డబుల్ బెడ్‌రూంలు మంజూరి చేసిన సిఎం ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ హన్మకొండ ప్రెస్‌క్లబ్ భవన్‌లో స్వీట్లు తినిపించుకుని, బాన సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, వల్లాల వెంకటరమణ, ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, టియుడబ్లూజే జిల్లా కన్వీనర్ తుమ్మ శ్రీధర్‌రెడ్డి, టియుడబ్లూజే ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ కెంచ కుమారస్వామి,కెమెరారమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు బోళ్ల అమర్, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లాల బుచ్చిరెడ్డి, కేసిఆర్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు కక్కెర్ల అనిల్‌కుమార్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్,పర్వతాలు, కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి, ఈసీ మెంబర్లు శ్రీకాంత్, అరుణ్, అభిలాష్, కట్ల రాజు, టియుడబ్లూజే నేతలు విద్యాసాగర్, రంగనాధ్, కంకణాల సంతోష్, రామకృష్ణ, శ్రీనివాస్, జన్ను స్వామి తదితరులు పాల్గొన్నారు.