Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ బర్త్ డే వేడుకల ఏర్పాట్లు

సిఎం కెసిఆర్ బర్త్ డే వేడుకల ఏర్పాట్లు

CM KCRనెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో సన్నాహాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అభిమానులు, పార్టీశ్రేణుల సమాయత్తం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టిఆర్‌ఎస్ శ్రేణులు రంగంసిద్ధం చేస్తున్నాయి. కవులు, కళాకారులు తెలంగాణ అభివృద్ధిలో కెసిఆర్ చేస్తున్న కృషిని కళారూపాలుగా తీసుకురావాలని ప్రయత్నాలను ప్రారంభించారు. ఈనెల 17వ తేదీన సిఎం.కెసిఆర్ జన్మదినోత్సవం ఉన్ననేపథ్యంలో పార్టీశ్రేణులు, అభిమానులు సేవాకార్యక్రమాలను నిర్వహించి ముఖ్యంత్రి కెసిఆర్‌పై అభిమానాన్ని చాటుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. గత సంవత్సరం జరిపిన జన్మదినోత్సవ వేడుకలకంటే అధికంగా జరపాలని పార్టీనాయకులు భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కెసిఆర్ అభిమానులు స్వచ్ఛందంగా జన్మదినోత్సవవేడుకలను నిర్వహించి సేవాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు పనులు ప్రారంభించనట్లు తెలుస్తుంది.

తెలంగాణ కీర్తి భావుటాను, అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దిక్చూచి కావడంతో కేసిఆర్ జన్మదినోత్సవాన్ని పండుగలాగా నిర్వహించాలని నాయకులు ఎవరికివారే స్వచ్ఛందంగా ఏర్పాట్లను ప్రారంభించారు. అభిమానులు పోటీ పడి వేడుకలు జరుపనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సాధించడమేకాదు, రెండు పర్యాయాలు ప్రజల ఆశీర్వదంతో ముఖ్యమంత్రి అయిన కేసిఆర్ జన్మదినోత్సవం ఫిబ్రవరి 17 తెలంగాణ ప్రజలకు పండుగలా తలపించేవిధంగా నిర్వహించాలని ఇప్పటికే మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నెక్లెస్ రోడ్ లోని జల విహార్ లో సిఎం కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు తలసాని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య పరీక్షకేంద్రాలు, కంటి పరీక్ష శిబిరాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు ఎల్‌ఈడి స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కళారూపాల ప్రదర్శన, కళాకారులకు ప్రశంసా పత్రాలు ఈవేదిక నుంచి ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

CM KCR Birthday Celebration Arrangements